కాళేశ్వరంతో హైదరాబాద్‌కు శాశ్వతంగా మంచినీళ్లు వస్తాయని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో మాట్లాడిన కవిత… కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తి అయితే.. 35 శాతం తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు అన్నారు.
40 టీఎంసీలతో శాశ్వతంగా హైదరాబాద్‌కు మంచినీళ్లు ఇచ్చే ప్రాజెక్టు… 16 టీఎంసీలతో పరిశ్రమలన్నిటికీ నీళ్లిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. నా తెలంగాణ రైతు ఎన్నడు కూడా మొగులుకు మొఖం పెట్టి చూడొద్దు అన్నారు.
వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు… తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కవిత కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు అన్నారు. కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు… కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్‌తో 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు అని తెలిపారు కవిత.
Also Read:భట్టిని కలిసిన కింగ్ నాగార్జున

