పోలీసులు కొట్టడంతో గాయపడిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్. యువకుల గాయాలకు సంబంధించిన ఫోటోస్, మెడికల్ రిపోర్ట్స్ చూపించి ఆవేదన వ్యక్తం చేశారు రాకేష్, కరిముల్లా, జాన్ విక్టర్ కుటుంబ సభ్యులు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన సాగుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసులు ఉంటే నడిరోడ్డుపై కొట్టేస్తారా..?, మరి 24 కేసులు ఉన్న చంద్రబాబును కూడా నడిరోడ్డుపై తన్నడం కరెక్టేనా..? చెప్పాలన్నారు. కేసులు తేల్చాల్సింది కోర్టులే కానీ పోలీసులు కాదు అని… పోలీసులకు కొట్టడం, షేమింగ్ చేసే హక్కు లేదు అన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పాయి అని…పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది అన్నారు జగన్. పోలీసుల వ్యవస్థను చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారు…తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా.. దాని అణగదొక్కేందుకు వైసీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:హరీష్ బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్

