భారతదేశం మరియు అమెరికా మధ్య గాఢంగా ఎదురుచూసిన వాణిజ్య ఒప్పందం చివరికి అమలులోకి రావడానికి సిద్ధంగా ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరుపక్షాలూ కీలక అంశాలపై సవివరంగా చర్చలు జరిపి, ఒప్పందాన్ని తుది దశకు తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పునర్నిర్మించే అవకాశముంది.
వాషింగ్టన్‌లోని యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం (USISPF) లో మాట్లాడిన అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ ల్యూట్నిక్, “ఇప్పుడు మేము ఒక ప్రగతి దశలో ఉన్నాం. భారత్ మరియు అమెరికా రెండు దేశాలకు అనుకూలంగా ఉండే స్థాయిలో మేము ఒక బిందువుకు చేరుకున్నాం. అందువల్ల ఎంతో దూరంలో కాకుండా ఓ ఒప్పందం సాక్షాత్కారమవుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు.
భారతదేశం తీసుకుంటున్న సానుకూల చొరవ తనకు లాభదాయకంగా మారుతుందని ల్యూట్నిక్ అభిప్రాయపడ్డారు. ముందుగానే ఒప్పందాల్లో చేరేవారికి మంచి అవకాశాలు ఉంటాయి. జూలై 4 నుంచి 9 వరకు వచ్చే వారికైతే నిమ్మరసం మిగిలినట్లే. భారత్ ఇప్పుడే ముందడుగు వేయడం మంచిదే అని వ్యాఖ్యానించారు.
భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ కూడా జూన్ 2న ఫ్రాన్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ… ఇరు దేశాలూ వాణిజ్య పరంగా కలిసి పనిచేయాలని, ఒకరికి ఒకరు ప్రాధాన్యాధారిత ప్రవేశం కల్పించాలని కోరుకుంటున్నాయి. మేము ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా కృషి చేస్తున్నాం అని స్పష్టం చేశారు.
Also Read:కరోనా..జాగ్రత్తలు తప్పనిసరి!

