తెలంగాణ జాతిపితకు నోటీసులా అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత.జ్యుడీషియల్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు కవిత.కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే అన్నారు. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోము అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత.
తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి 18 సంవత్సరాలు కావొస్తోంది. తెలంగాణ సమాజంలోని ప్రతి వ్యక్తి తలలో నాలుకలా, ప్రతి ఇంట్లో ఆడబిడ్డలా జాగృతి సంస్థ కలిసి ఉంది అన్నారు. ఇప్పటివరకు అశోక్ నగర్ లో తెలంగాణ జాగృతి కార్యాలయం ఉండేది. ఈరోజు జాగృతి కార్యాలయం బంజారా హిల్స్ కి షిఫ్ట్ అయింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న జై తెలంగాణ అనాలి. రాజీవ్ యువ వికాసం అని జూన్ 2 తారీకున కొత్త పథకం తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? తెలంగాణ యువ వికాసం అని పేరు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నాలుగేళ్ల నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు నోటీసు ఇచ్చారా? తెలంగాణ జాతిపితకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే. జూన్ 4న మహాధర్నా చేయబోతున్నాం అన్నారు. కేసీఆర్ కి రెండు కళ్లు. ఒక కన్ను బీఆర్ఎస్, రెండో కన్ను జాగృతి. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోము. గోదావరి జలాల్లో మన వాటా విషయంలో బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు మాట్లాడాలి అని డిమాండ్ చేశారు.
Also Read:బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..దుష్ప్రచారమే!

