బీజేపీలో బీఆర్ఎస్ విలీనం దుష్ప్రచారమేనని తేల్చిచెప్పారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారు. తెలంగాణ అంటే నక్సలైట్లు అన్న సందర్భంలో కేసీఆర్ పార్టీని పెట్టారు అని తెలిపారు.కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ భవన్లో ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. కేసీఆర్ ఆలోచనలు నాకు తెలుసు. తెలంగాణ ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగదు అన్నారు.
కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు, వైఎస్ఆర్ను కేసీఆర్ ఎదుర్కొన్నారు. తెలంగాణ సాధించి కేసీఆర్ సీఎం అయ్యి అభివృద్ధి చేశారు. బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడవని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు.
Also Read:మెంతులు.. అద్భుత వరం!

