కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న, మధ్య తరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటే స్వాగతించాం అన్నారు ఎమ్మెల్యే కృష్ణారావు. బోరబొండలో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు అనుభవించి కాంగ్రెస్ వెళ్ళిన కార్పొరేటర్ అరాచకాలు పిసిసి అధ్యక్షుడు గమనించాలి…బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ మృతి కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలి అన్నారు. సోమవారం ప్రజావాణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డింగ్ లపై పిర్యాదులు చేయడం..నిర్మాణదారుల వద్ద డబ్బులు దండుకోవడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చెప్పాలన్నారు.
శేరిలింగంపల్లిలోని అయ్యప్ప సొసైటీలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుంటే ఎందుకు కూల్చివేతలు చేపట్టలేదు చెప్పాలన్నారు. ఫతే నగర్ బ్రిడ్జి కోసం నాటి మంత్రి కేటీఆర్ నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారు…కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం వల్లే మొన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి అన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే ఫతే నగర్ బ్రిడ్జి పైన ధర్నా చేపడతామని హెచ్చచించారు.
Also Read:కెనడాలో కార్చిచ్చు కలకలం..

