- Advertisement -
జూరాలకు వరద పోటెత్తింది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో 97,000 వేల క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్టు ఔట్ ఫ్లో 90,394 వేల క్యూసెక్కులుగాఉంది.
ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 7.740 టీఎంసీలుగా ఉంది. విద్యుత్ కేంద్రాలలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతంది.
మరోవైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి సహా నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇడుక్కి, వయనాడ్, ఎర్నాకులం, పత్తనంతిట్టా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read:BRS..రజతోత్సవ వేడుకకు సర్వం సిద్ధం
- Advertisement -

