ఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు, బీ కేటగిరి సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయాలనీ , డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు మరియు తదితరులు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… బీ కేటగిరీ సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు..రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు ఇప్పటికే 20 నుండి 25 లక్షల వరకు డొనేషన్లు తీసుకుంటున్నారు.ప్రభుత్వం ఇంజినీరింగ్ కాలేజీలతో కుమ్మక్కయింది.యాజమాన్యాలు ఇచ్చిన లంచాలతో ప్రభుత్వం మౌనంగా ఉంది.గత ఏడాది ఉన్న ఫీజులు అలాగే కొనసాగించాలి ఒక్క రూపాయి కూడా పెంచద్దని డిమాండ్ చేస్తున్నాము అన్నారు.
యాజమాన్యాలు ఇచ్చే డబ్బులకు లొంగి ప్రభుత్వం ఫీజులు పెంచితే చూస్తూ ఊరుకోం..బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అన్నారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…మెడికల్ కౌన్సిల్ ద్వారా సీట్లను భర్తీ చేసినట్లు ఇంజినీరింగ్ సీట్లను అదేవిధంగా భర్తీ చేయాలి అన్నారు.
బీ కేటగిరీ సీట్లు ఆన్లైన్ ద్వారానే భర్తీ చేయాలి..లేని పక్షంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యం లో పోరాటం ఉదృతం చేస్తాం అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ మొదలు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు అధిక ఫీజులు పెంచి పేదలకు భారం పడేలా చేస్తున్నారు..ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయ్యాక ఒక మాట మాట్లాడి మాట తప్పారు సీఎం రేవంత్ రెడ్డి..ప్రైవేటు యాజమాన్యాలకు వత్తాసు పలికి అధిక ఫీజులు పెంచితే చూస్తూ ఊరుకోం..ప్రభుత్వం దిగి రాకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల తరపున పోరాటం చేస్తాం అన్నారు.
Also Read:రేప్ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు

