ఐపీఎల్ 2025 లీగ్ దశ పూర్తైంది. ఇవాళ్టి నుండి ప్లే ఆఫ్స్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫైయర్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది ఆర్సీబీ. చంఢీగడ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఓడిపోయిన జట్టుకు ఫైనల్ చేరుకునేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్ 2లో ఆ జట్టు ఆడనుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన గుజరాత్, ముంబై జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. మే 30న చండీగడ్ వేదికగానే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. ఇందులో ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంటుంది.
హ్మదాబాద్ వేదికగా జూన్ 1న క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో పోటీపడుతుంది. ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. ఈ మ్యాచ్‌లో క్వాలిఫయర్-1లో విజయం సాధించిన జట్టు, క్వాలిఫయర్ -2లో గెలుపొందిన జట్టుతో తలపడనుంది.
Also Read:GIC:హరితసేనలో నటి మధుమిత

