గ్రీన్ ఇండియా హరితసేనలో భాగంగా జూబ్లీహిల్స్ పార్క్ లో మొక్కలు నాటారు నటి సింధూర. ఈ సంధర్భంగా నటి సింధూర గారు మాట్లాడుతూ ముందుగా అందరికీ నమస్కారం తెలియచేస్తూ మన గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు గత ఏడు సంవత్సరాలు క్రితం ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా మొక్కలు నాటడం చాలా సంతోషం గా ఉంది అన్నారు.
ప్రతీ ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామం చేస్తూ పర్యావరణ పరిరక్షణ అందరికీ తెలియచేసేలా సంతోష్ కుమార్ గారు గత ఏడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం అద్భుతముగా ముందుకు సాగుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం ఇందులో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ పార్క్ లో మొక్కను నాటడం జరిగింది.
అలానే నా వంతుగా గ్రీన్ ఇండియా హరితసేనలో భాగంగా నేను ముగ్గురిని నామినేట్ చేస్తున్నాను వారు సుష్మ కిరణ్,రోహిణి మరియు లహరి గార్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మొక్కలు నాటలని తెలియజేశారు.. ఈ కార్యక్రమం హరితసేన స్టేట్ కో-ఆర్డినేటర్ భోజనారాయణ ఆధ్వర్యంలో జరిగింది.
Also Read:ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

