TJF రజతోత్సవ సంబురాల పోస్టర్ ఆవిష్కరణ

14
- Advertisement -

తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (TJF) రజతోత్సవ సంబురాల పోస్టర్ ను ఇవాళ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించిన TJF.. 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.

దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని కేటీఆర్ గుర్తుచేశారు.

Also Read:తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఆగమనం…

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమానికి BRS ప్రభుత్వ హయంలో ఎన్నో రకాల కార్యక్రమాలు అమలు చేశామని, TJF కి తాము ఎప్పటికీ అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -