పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40°C లోపు లేదా దానికి తక్కువగా ఉండే అవకాశం ఉందని.. వాతావరణం పూర్తిగా మేఘావృతంగా ఉంటుందని తెలిపారు. దక్షిణ మరియు మధ్య తెలంగాణలో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 38°C ఉండవచ్చు. సాయంత్రం లేదా రాత్రి వర్షాలు / ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రోజు ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. మేఘావృతమైన ఆకాశం కనిపిస్తుందని తెలిపారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి లేదా తెల్లవారుజామున వర్షాలు / ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని… దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మరో 24 గంటలపాటు తీవ్రమైన వర్షాలు / ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రాయలసీమ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
భారీ వర్షాలతో బొగత జలపాతంకు జలకళ సంతరించుకుంది. జలధారలతో సందడి చేస్తోంది తెలంగాణ నయాగరా. నెల ముందుగానే కనువిందు చేస్తోండగా ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో బొగతాకు భారీగా వరదనీరు చేరుకుంది .మండే ఎండల్లోనూ బొగత జలపాతానికి జలకళ సంతరించుకోవడంతో క్యూ కడుతున్నారు పర్యాటకులు.
Also Read:డిక్లరేషన్ సరే..డెడికేషన్ ఏది?:హరీష్

