IPL 2025: ప్లే ఆఫ్స్ నుండి కోల్‌కతా ఔట్

9
- Advertisement -

ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌ రేస్‌ నుంచి కోల్‌కతా తప్పుకుంది. వర్షం కారణంగా నిన్న RCB vs KKR మ్యాచ్ రద్దు కాగా దీంతో రెండు జట్లకు చెరో పాయింట్‌ ఇచ్చారు. 17 పాయింట్లతో టాప్‌ స్పాట్‌కు చేరింది ఆర్సీబీ. 13 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేస్‌ నుంచి తప్పుకుంది కోల్‌కతా.

KKR ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉండగా ఆ మ్యాచ్‌లో విజయం సాధించినా కేకేఆర్ జట్టు 14 పాయింట్లకు చేరుతుంది. ఇప్పటికే మూడు జట్లు 14కు మించి పాయింట్లు సాధించాయి. 14పాయిట్లతో ఉన్న ముంబయి, 13 పాయింట్లతో ఉన్న ఢిల్లీ మధ్య మ్యాచ్ ఉండటంతో వాటిలో ఒక జట్టు 14 పాయింట్లను దాటుతుంది. దీంతో కోల్‌కతాకు ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు దారులున్నీ మూసుకుపోయాయి.

17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంకు చేరుకుంది ఆర్సీబీ. ఆర్సీబీ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. రెండింటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అధికారికంగా ఖరారవుతుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే‌ఆఫ్స్ అవకాశాలు కోల్పోగా.. తాజాగా కేకేఆర్ జట్టు ఆ జాబితాలో చేరింది.

Also Read:PSLV-C61:సాంకేతిక సమస్య..మిషన్ అసంపూర్తి

- Advertisement -