రెడ్డిలు,గౌడ్‌లకే పదవులా?:సునీతా రావు

8
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్డిలకు, గౌడ్​లకు పదవులు ఇస్తున్నారు అని మరోసారి మండిపడ్డారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. మొగుళ్ళు పనిచేస్తే పెళ్ళాలకి పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే… మరి మేము పెళ్ళాలము పనిచేస్తున్నాము.. మా మొగుళ్ళకు కూడా పదువులు ఇవ్వండి అన్నారు.

మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడు … పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి.. మా చెల్లెళ్ళకు మాత్రం రావడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు అన్నారు. ఒక పదవి వదిలేసి మహిళలకు ఇవ్వమని చెప్పండి.. సంవత్సరంన్నర నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక్క పదవి ఇవ్వలేదు అన్నారు. నన్ను హెరాస్మెంట్ చేయొద్దు.. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోమంటే వెళ్లిపోతా..నిన్న ఇచ్చిన ఆర్టిఏలో కూడా ఒక్క పదవి మహిళా కాంగ్రెస్‌కి ఇవ్వలేదు అని దుయ్యబట్టారు.

Also Read:చైనాలో వరుస భూకంపాలు

- Advertisement -