స్ఫూర్తిగా నిలిచే హన్సిక..

240
Hansika as "Spoorthi" from "Goutham Nanda"
- Advertisement -

శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “గౌతమ్ నంద”. గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంపత్ నంది దర్శకుడు. ఇంతకుమునుపు సినిమాలో కేతరీన్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసిన చిత్ర బృందం నేడు మరో కథానాయిక అయిన హన్సిక పోషిస్తున్న “స్పూర్తి” పాత్ర లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో హన్సిక అందాలతోపాటు అభినయంతోనూ అలరించనుందట.

Hansika as "Spoorthi" from "Goutham Nanda"

చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాట్లాడుతూ.. “హన్సిక “గౌతమ్ నంద”లో స్పూర్తి అనే పాత్ర పోషిస్తుంది. సాంప్రదాయబద్ధ యువతిగా హన్సిక నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. హీరో క్యారెక్టర్ ను అనునిత్యం స్ఫూర్తిగా నిలిచే పాత్ర హన్సికది. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఇకపోతే.. “గౌతమ్ నంద” షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదలైన టీజర్ మరియు మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది. మా బ్యానర్ నుండి వస్తున్న బెస్ట్ సినిమాగా “గౌతమ్ నంద” నిలుస్తుంది. త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం” అన్నారు.

గోపీచంద్, హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!

- Advertisement -