- Advertisement -
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు.హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 37°C ఉండొచ్చు అని…పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా వంటి అంతర్గత దక్షిణ ఏపీ జిల్లాల్లో అనేక చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రత 40°C వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నంలో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 34°C ఉండొచ్చు అని తెలిపారు.
Also Read:సోనియా గాంధీకి మాజీ మంత్రుల లేఖ
- Advertisement -

