రేవంత్ రెడ్డి ప్రజాపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది అన్నారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో ఏదో ఒక మూలన కూల్చివేతలు రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది… వరంగల్,నాగర్ కర్నూల్ లో రోడ్డు పక్కన ఉన్న పేదల షాపులను కూల్చారు అన్నారు. అందగత్తెల కోసం రోడ్డు పక్కన పేద ప్రజల షాపులను కూలుస్తారా…? చెప్పాలన్నారు.
అందగత్తెలను తీసుకువచ్చి అందమైన గోడలను చూపెడితే అందం వస్తుందా…?.. ఓరుగల్లు చారిత్రక నగరం అన్నారు. ఎవరి మెప్పుకోసం ప్రజలను ఏడుపిస్తున్నారు…?, అందగత్తెలతో రాష్ట్రానికి అందం వస్తుందా…? చెప్పాలన్నారు. అందమైన పాలనతో రాష్ట్రానికి అందం వస్తుంది… బుల్డోజర్ తీసుకువచ్చి
కూలగొట్టడం ప్రజాపాలనా…? చెప్పాలన్నారు.
ప్రజలతో మాట్లాడి సమస్యలను ఎందుకు పరిష్కరించరు…రాష్ట్రంలో కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కువ జరుగుతున్నాయి..హైడ్రా,మూసీ,లగచర్ల, హెచ్.సి.యూ,వరంగల్,నాగర్ కర్నూల్ లో పేదలపై దాడి చేస్తున్నారు అన్నారు. కేటీఆర్ ఎస్400 మిస్సైల్ లా ప్రజలకు అండగా నిలుస్తారు… రైతుబంధుకు డబ్బులు లేవని అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు. అబద్దాలు చెప్పి,ఆకాశంలో విహరిస్తే ప్రభుత్వానికి అందం రాదు..రాష్ట్రం పరువు పోయింది,అని అందాల పోటీలతో పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.
అందాల పోటీలతో రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి…?,కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఫార్ములా ఈ రేస్ రద్దు చేశారు, ఫార్ములా ఈ రేస్ తో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని నీల్సన్ అనే సంస్థ చెప్పింది అన్నారు. ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ పై ప్రభుత్వం బురదచల్లింది..ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే సినీ,క్రీడా ప్రముఖులు వచ్చారు అన్నారు. అందాల పోటీలతో రూపాయి లాభం లేదు… అందాల పోటీ నిర్వహణ ప్రభుత్వానికి చేతకావడం లేదు అన్నారు. అందాల పోటీకి వచ్చిన గెస్టులను గచ్చిబౌలికి తీసుకువెళ్లి వచ్చిన కంపెనీలను చూపించాలి…కేంద్రం నుంచి రాష్ట్రానికి అలెర్ట్ మెసేజ్ లు వచ్చినా అందాల పోటీలు నిర్వహిస్తున్నారు అన్నారు.
రాష్ట్రంలో వరిధాన్యం నీళ్ల పాలు అవుతోంది..అందాల పోటీలతో ప్రభుత్వం బిజీగా ఉంది అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏం కావాలి…?,అందాల పోటీలపై సీఎం రివ్యూలు చేస్తున్నారు..ప్రభుత్వం కూల్చివేతలు ఆపాలి… ప్రభుత్వం కూల్చిన షాపులకు చెందిన చిరువ్యాపారులకు నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
Also Read:ధాన్యం కొనుగోళ్లపై భరోసా ఏది?:హరీష్

