నైరుతి…కబురు వచ్చేసింది

7
- Advertisement -

అండమాన్ నికోబార్ తీరాన్ని తాకాయి నైరుతి రుతుపవనాలు. చురుకుగా కదులుతుండటంతో ఈ నెల 27వ తేదీ వరకు కేరళ తీరాన్ని తాకి, జూన్ 12వ తేదీ వరకు తెలంగాణను తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు.

తెలంగాణలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం ఉండనుంది. తెలంగాణలో మరో వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ముగియనుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఏపీకి ఐదు రోజులు వర్ష సూచన ఉండగా ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తాలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా జూన్ మొదటివారంలో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశం ఉండనుందని తెలిపాయి.

Also Read:BRS:సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. ఫిర్యాదు

- Advertisement -