పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. భారత వాయుసేన యొక్క కీలకమైన ఫార్వర్డ్ ఆపరేషనల్ స్థావరాలలో ఒకటైన పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను మోదీతో పంచుకున్నారు సైనికులు. ఈ సందర్భంగా వైమానిక సైనికులతో ముచ్చటించి వారితో పోటోలు ,సెల్ఫీలు దిగి మానిసిక స్థైర్యాన్ని పెంచారు ప్రధాని మోదీ.
ప్రధాని మోదీ ఉదయం 7 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్ బేస్ నుండి ఆదంపూర్‌కు బయలుదేరి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్ తో కలిసి వెళ్లారు. ఆయన సుమారు ఒక గంట పాటు ఎయిర్ బేస్‌లో గడిపారు. ఆదంపూర్ ఎయిర్ బేస్ భారత వాయుసేనకు చెందిన MiG-29 యుద్ధవిమానాల స్థావరం. పాకిస్థాన్ మే 9-10 రాత్రి దాడుల్లో ఆదంపూర్‌లోని S-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నాశనం చేశామంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. అయితే, ప్రధాని మోదీ ఎయిర్ బేస్‌ను సందర్శించి, S-400 బ్యాక్డ్రాప్‌లో జవాన్లకు వందనం చేసిన ఫోటోలు ఆ తప్పుడు ఆరోపణలను ఖండించాయి.
ఇంకొక ఫోటోలో మిగ్-29 మరియు S-400 సిస్టమ్‌ల పక్కన ప్రధాని, సైనికులు గర్జనతో గెలిచినట్లు పంచ్ చేసిన దృశ్యం కనిపించింది.
Also Read:విశ్వక్ మూవీలో పుష్ప 2 నటుడు!

