72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. హెరిటేజ్ వాక్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై సాయంత్రం చౌమహల్లా ప్యాలెస్‌లో ముగుస్తుంది. అతిథులు రాయల్ ప్యాలెస్ పరిసరాల్లో భోజనం చేస్తారు.
రేపు ఈ సుందరీమణుల్లో ఓ బృందం వరంగల్ జిల్లాలో పర్యటించనుంది.మంగళవారం జరగనున్న హెరిటేజ్ వాక్ కు మొత్తం 140 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. చార్మినార్, లాడ్ బజార్, జుల్లు ఖానా, చౌమహల్లా ప్యాలెస్ చరిత్రను వారికి వివరించే టూర్ గైడ్లు కూడా వారితో పాటు ఉంటారు. ఈ ప్రతినిధులు చార్మినార్ స్మారక చిహ్నాన్ని ఎక్కి పై నుండి నగరాన్ని వీక్షించనున్నారు.
అలాగే పోటీదారులు చౌమహల్లా ప్యాలెస్‌కు వెళ్లే ముందు లాడ్ బజార్‌లోని గాజుల దుకాణాలను, జుల్లు ఖానాలోని జర్దోసి వర్క్‌షాప్‌లను మరియు మోతీ గల్లీలోని దవాసాజ్ దుకాణాలను సందర్శిస్తారు.
Also Read:‘సార్పట్ట 2’ … క్రేజీ న్యూస్!

