- Advertisement -
ఒక్క విజిల్ వేస్తే చాలు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు టీపీసీసీ చీఫ్ మాస్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో చేతకాని, దద్దమ్మ మంత్రులుగా ఉన్న మీకు సీఎం రేవంత్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అని దుయ్యబట్టారు.
మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్.. బీఆర్ఎస్ నుంచి తన్ని తరిమేస్తే బీజేపీలోకి వెళ్లారు…ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడంతో ఈటల ఆవేశం కట్టలు తెంచుకుంటోందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు అని హెచ్చరించారు. దేవాదాయ శాఖ భూములను కబ్జాలను చేసిన ఈటలకు హైడ్రా గురించి మాట్లాడే అర్హత లేదు అని తేల్చిచెప్పారు.
Also Read:Subham : మూడు రోజుల వసూళ్లు ఎంతో తెలుసా?
- Advertisement -

