Subham : మూడు రోజుల వసూళ్లు ఎంతో తెలుసా?

8
- Advertisement -

శుభం అంటూ వచ్చేసింది నటి సమంత. చాలా కాలం తర్వాత తెలుగులో నటిగా అలాగే నిర్మాతగా సమంత చేసిన తొలి చిత్రమే శుభం . ప్రవీణ్ కాండ్రేగు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది. ఆ హైప్‌కు తగ్గట్టుగానే మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు కీలకపాత్ర పోషించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ సినిమాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. విడుద‌లైన మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.5.25 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది.

3 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించగా అప్పుడే బ్రేక్ ఈవెన్ సాధించేసింది. ఇక ఓటీటీ హ‌క్కుల‌ను జీ మంచి మొత్తానికే సొంతం చేసుకున్న‌ట్లుగా స‌మాచారం. దీంతో నిర్మాత‌గా స‌మంత తొలి చిత్రంతోనే భారీగానే లాభాలు అందుకున్న‌ట్టేనని టాక్ నడుస్తోంది.

Also Read:PV: ఢిల్లీలో పీవీ విగ్రహాం ఏర్పాటు!

- Advertisement -