తెలుగు రాష్ట్రాల వెదర్‌ అప్‌డేట్

9
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్టును తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ తూర్పు తెలంగాణలో మాత్రం 41°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని… హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 39°C ఉండే అవకాశం ఉందన్నారు.రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షం కురుస్తుందని..ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అంతర్గత తూర్పు తీర ప్రాంతాల్లో చాలా చోట్ల 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అన్నారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో గర్జనాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.

Also Read:AP:మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ

- Advertisement -