ఈడీ విచారణకు మహేష్ బాబు

8
- Advertisement -

ఇవాళ ఈడీ విచారణకు హీరో మహేష్ బాబు హాజరుకానున్నారు. సాయిసూర్య, సురానా ప్రాజెక్టు కేసుల్లో నేడు హీరో మహేష్ బాబును విచారించనుంది ఈడీ. ఇటీవల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో కీలక ఆధారాలను సేకరించారు అధికారులు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య ప్రకటనలకు మహేష్ బాబు రూ.5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టు ఆరోపిస్తోంది ఈడీ. అందులో రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతిలో తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి.

మహేష్ బాబు చేసిన ప్రకటనలను చూసి, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి అని తెలియక అనేకమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ, డబ్బును అక్రమమైన పద్ధతిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు.

Also Read:జుట్టు రాలుతుందా..అయితే మీ కోసమే!

- Advertisement -