- Advertisement -
భారత సైన్యం ముందు పాకిస్తాన్ తలవంచక తప్పడం లేదు. పాక్ ఎన్ని ఎత్తులు వేసిన వాటిని చిత్తు చేస్తోంది భారత్. శుక్రవారం మరోసారి భారత్ లోని 11 ప్రాంతాలు లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు విఫలయత్నం చేసింది. పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ పేల్చేసింది భారత సైన్యం .
జమ్ము, సాంబా, జైసల్మేర్, పఠాన్ కోట్, పూంచ్, ఫిరోజ్ పూర్, అమృత్ సర్, పోఖ్రాన్, ఉదంపూర్ లో డ్రోన్లతో ప్రజలపై దాడులకు దిగగా వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. ఫిరోజ్ పూర్ లో ప్రజల మధ్యలో ఓ డ్రోన్ పేలగా ముగ్గురు గాయపడ్డారు.
సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో జమ్ముకశ్మీర్, రాజస్తాన్, పంజాబ్ సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది.
Also Read:భారత ఆర్మీకి అండగా ఉందాం
- Advertisement -

