హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “వీడీ 14”. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని, 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని గతంలో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇవాళ విజయ్ పుట్టిన రోజు కావడంతో VD14 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
అయితే ఈ పోస్టర్ లో విజయ్ ఫేస్ చూపించలేదు. ఓ దేవుడి విగ్రహం ముందు విజయ్ ధ్యానం చేస్తున్నట్టు ఉంది. పేస్ చూపించకుండా కేవలం వీపు భాగం చూపించారు. ఈ పోస్టర్ లో విజయ్ అదిరిపోయే బాడీతో కనిపించాడు. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
Also Read;IPL 2025: వారం రోజుల పాటు ఐపీఎల్ వాయిదా

