ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యం: హరీష్

13
- Advertisement -

సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 195 మంది లబ్ధిదారులకు 43 లక్షల సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతు.. రాష్ట్రంలో సిద్దిపేట నియోజక వర్గంలోనే అత్యధిక చెక్కులు అందించాం అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం ఉండేది అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, వైద్యులు ఉండటం లేదు… కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో నేను పోత బిడ్డ సర్కార్ ఆసుపత్రి కి.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో నేను పోను బిడ్డ సర్కార్ ఆసుపత్రి కి అనే పరిస్థితి వచ్చిందన్నారు.

రేవంత్ రెడ్డి మాటలు మూరెడు ఉంటే చేతలు జానేడు మాత్రమే ఉన్నాయి.. సీఎం మాటలు గడ్డకు ఎక్కేవరకు ఒక్కమాట గడ్డ ఎక్కాక ఒకమాట మాట్లాడుతున్నారు..సిద్దిపేట అభివృద్ధి పనులను అడ్డుకున్నారు… మీ ఆశీర్వాదంతో ఎంత దూరం అయినా పోరాడతానని చెప్పారు.

Also Read:వరుస ప్రాజెక్టులతో శ్రీవిష్ణు!

- Advertisement -