- Advertisement -
ఆపరేషన్ సింధూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు గర్వపడేలా చేస్తున్నాయన్నారు. సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం.. జై హింద్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ ద్వారా వెల్లడించారు.
మరోవైపు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో.. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు.
ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తక్షణమే హైదరాబాద్ బయల్దేరి రావాలని సూచించారు. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు.
https://x.com/revanth_anumula/status/1919944242819936744
- Advertisement -

