ఆదాయాన్ని లూటీ చేసి ఢిల్లీకి మూటలా?

12
- Advertisement -

తెలంగాణ ఆదాయాన్ని లూటీ చేసి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డికి ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత లేదన్నారు.

ఎన్నికల ముందు ప్రజలని రెచ్చగొట్టి హామీలిచ్చి నేడు చేతులెత్తేస్తున్నారు. మాది వందేళ్ళ చరిత్ర , అపార పరిపాలనా అనుభవం ఉందని కోసిన కోతలు ఏమయ్యాయి..? రేవంత్ రెడ్డిలా కేసీఆర్ బాధ్యతారాహిత్యమైన హామీలు ఇవ్వలేదు చెప్పాలన్నారు.

రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తోంది. మాఫియాలా రాష్ట్ర ఆదాయం లూటీ చేసి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు అని దుయ్యబట్టారు. హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. నిన్న రేవంత్ మాట్లాడిన మాటల్లో ప్రతి అక్షరం అబద్ధమే…ఒక్క సంవత్సరం మంత్రులు కడుపుకట్టుకుంటే అన్ని హామీలు అమలయ్యేవి. రేవంత్ దొంగ చరిత్ర చూసి అందరు ఆయన్ని చెప్పులెత్తుకెళ్లే వాడిలా చూస్తున్నారు అని దుయ్యబట్టారు.

Also Read:ఐరాసలో పాక్ ప్రయత్నం విఫలం

- Advertisement -