జయలలిత మరణం తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పొలిటికల్ ఎంట్రీ వార్తలు తమిళనాట ఇప్పుడు హాట్ టాప్ గా మారాయి. గత కొద్ది రోజులుగా రజనీ రాజకీయాల్లోకి రావాలని.. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన సోదరుడు సత్యనారాయణరావ్ గైక్వాడ్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. అయినప్పటికీ రజనీ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ రాలేదు.
అభిమానులతో పలు మార్లు మీటింగ్ లు, రైతులతో చర్చలు, హిందూ మక్కల్ కచ్చి నేతలతో భేటి .. అన్నింటిని చూస్తుంటే రజినీ రాజకీయ రంగ ప్రవేశానికి సమయమైదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజులుగా రాజకీయ రంగప్రవేశంపై మౌనం వహించిన రజనీకాంత్ తాజాగా రోబో 2 సినిమా విడుదల తర్వాత రాజకీయ ప్రవేశంపై బిగ్ ఎనౌన్స్ మెంట్ చేస్తానని చెప్పారు. అంతే కాదు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మరోసారి తాను అభిమానులతో సమావేశం అవుతానని కూడా అన్నారు. దీంతో తలైవా పొలిటికల్ ఎంట్రీకి ఎంతో దూరం లేదని, డిసెంబర్ 12 పార్టీ ఎనౌన్స్ మెంట్ తప్పక చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. రజనీ 2.0 సినిమా జనవరి 25, 2018న విడుదల కానుంది. ఈ క్రమంలో రజనీ పొలిటికల్ ఎంట్రీ కోసం జనవరి వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఆయనతో పొత్తుకు సిద్ధమేనని అంటున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం.