రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సినిమా లుక్‌ని రివీల్ చేయగా చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన పెద్ది గ్లింప్స్ ఒక్క తెలుగులోనే 24 గంటల్లోపే 30 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఇక అన్ని భాషల్లో కలిపి 35 మిలియన్స్ దాటింది.
ఇండస్ట్రీ బజ్ ప్రకారం.. ఏఆర్ రహమాన్ కంపోజ్ చేస్తున్న ఒక ఫుల్ ఎనర్జిటిక్ మాస్ సాంగ్ స్పెషల్ సెటప్ రెడీ అయ్యిందట. ఆ పాటలో చరణ్ స్టైల్, శ్రీలీల గ్రేస్ కలిస్తే.. థియేటర్లలో ఇక మాస్ ఎక్స్‌ప్రోషన్ ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఈపాట రామ్ చరణ్ పాత్రకు టర్నింగ్ పాయింట్‌గా ఉండబోతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. శ్రీలీల ఎంట్రీతో మాస్ ఆడియెన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేయడమే టీం లక్ష్యమట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1980లో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో రూపొందుతోంది.
Also Read:రేవంత్ ఢిల్లీ టూర్..గుండు సున్నా!

