- Advertisement -
కింగ్డమ్..విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండగా ఇప్పటివరకు విడుదలైన టీజర్‌తో పాటు రీసెంట్గా రిలీజ్ చేసిన హృదయం లోపల సాంగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.
విజయ్ దేవరకొండ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాటలో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ సినిమాలో విజయ్ లుక్ చాలా రఫ్‌గా ఉంది.
ఇక ఈ సినిమా హిట్ విజయ్ దేవరకొండకు చాలా కీలకం. ఎందుకంటే ఆయన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మించగా, భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తున్నారు.
Also Read:పాకిస్తాన్‌కు మరో దెబ్బ..
- Advertisement -

