భారత్‌కు ఇరాన్ మంత్రి..వివరాలివే

19
- Advertisement -

ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి భారత్‌లో పర్యటించనున్నారు. మే 7 నుండి రెండు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి మరియు కనెక్టివిటీ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ఈ టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అరాఘ్చి భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:బరువు తగ్గాలనుందా..అయితే మీకోసమే!

- Advertisement -