కంచి పీఠం 71వ పీఠాధిపతిగా గణేష్ శర్మ

10
- Advertisement -

సత్య చంద్ర శేఖరేంద్ర సరస్వతి అని కంచి కామకోటి 71 వ పీఠాధిపతిగా అభిషేకం అయిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రమణ్య గణేష్ శర్మ ద్రవిడ్ కు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య నామకరణం చేశారు. నేడు ఉదయం, అక్షయ తృతీయ సందర్భంగా, సాంప్రదాయబద్ధంగా జరిగిన సన్యాస దీక్షను సత్యబ్వేంకట గణేష్ సుబ్రమణ్య శర్మకు శ్రీ విజయేంద్ర సరస్వతి దీక్ష నిచ్చారు. ఆది శంకరాచార్యులు ప్రబోధించిన అద్వైత మతానికి ఏర్పడిన పీఠాల్లో తమిళనాడులోని కంచి కామకోటి పీఠం ఒకటి.

అద్వైత తత్వం: ఈ లోకమంతా విడివిడిగా కనిపించినా, నిజానికి అన్నీ ఒక్కటే అని చెప్పే తత్వమే అద్వైతం. మనం చూస్తున్న ఈ జగత్తు తాత్కాలికం, మాయ వల్ల కలిగిన భ్రమ మాత్రమే. అసలు నిజం — బ్రహ్మం మాత్రమే, అది ఎప్పటికీ మారదని, శుద్ధమైన చైతన్యంగా ఉంటుందని శంకరాచార్యులు వివరించారు. మనం అనుకునే “నేను” కూడా బ్రహ్మంతోనే సమానం — జీవాత్మ అంటే పరమాత్మే. ఈ సత్యాన్ని మనం జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు, అజ్ఞానం తొలగిపోతుంది; మనం భయాలను, బంధాలను దాటి నిజమైన స్వేచ్ఛను పొందుతాం — అదే మోక్షం.

అనేక సాంఘిక పరిణామాల నుంచి ప్రపంచమంతా వేర్వేరు ప్రదేశాల్లో సాంస్కృతిక పునర్జీవనం సంభవించిన కాలంలో ఆదిశంకరాచార్యులు (క్రీస్తుపూర్వం) అద్వైత తత్వాన్ని ప్రభోదించారు. ఆయన స్థాపించిన కాంచీపురం (కంచి) పీఠంనుంచి హిందూ దేశమంతటా అద్వైత తత్వం విస్తరించింది. ఆదిశంకరాచార్యులను “నడిచే శివుడు” అని హిందువులు విశ్వసిస్తారు.

… వేదాలను వైదిక శాస్త్రాలను అపపోసిన వారిని అనేక వడపోతల ద్వారా, పీఠాధిపతి నిర్ణయానుసారం ఉత్తరాధికారిగా ఎంపిక చేస్తారు. పీఠాధిపతి మహానిర్యాణానంతరం ఉత్తరాధికారి కంచి స్వామి (పీఠాధిపతి) అవుతారు. ఇది పరంపరగా సాగుతోంది.

ఇపుడు పీఠాధిపతిగా వున్న శంకర విజయేంద్ర సరస్వతి ఈ పరంపరలో 70 వ స్వామి. 68 వ స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి (ఇదే పేరుతో అప్పటికి ఏడుగురు కంచిపీఠం అధిపతులుగా వున్నారు) సుదీర్ఘకాలం 1907 నుంచి 94 వరకూ కంచి పీఠాధీశులుగా వున్నారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అనంతరం కంచి పీఠం బాద్యతలు చేపట్టిన 69 వ స్వామి జయేంద్ర సరస్వతి 1994 నుంచి 2018 మధ్యలో వైద్య వసతుల ద్వారా, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం ద్వారా హిందూ మతాన వారితర్వాత 70 వస్వామిగా (అప్పటి ఉత్తరాధికారి) శంకర విజయేంద్ర సరస్వతి 2018 నుంచి పీఠాధీశులుగా వున్నారు.

71 వ కంచి పీఠం స్వామిగా నియమితులైన గణేశ శర్మ ద్రవిడ్ ఒక ఆధ్యాత్మిక కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి దన్వంతరి అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధాన పూజారి. పూర్వీకులూ ప్రముఖ వేద పండితులే.వారు 2006లో వేద విద్య ప్రారంభించి ఋగ్వేదంతో పాటు యజుర్వేదం, సామవేదం, దశోపనిషత్తులపై లోతైన అధ్యయనం చేశారు. శ్రీ కాంచి పీఠం శంకరాచార్యుల ఆశీస్సులతో విద్యాభ్యాసం కొనసాగించారు.ఈ ఉత్తరాధికార అభిషేకం, జగద్గురు ఆది శంకరాచార్యుల 2,534వ జయంతి సందర్భంలో జరగడం విశిష్టతను ఇస్తోంది.

Also Read:బాహుబలి..రీ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -