ఇది ఆరంభం మాత్రమే: హరీష్

16
- Advertisement -

ఉదయం నుండి ఎంతయినా కుట్రలు, అడ్డంకులు చేసినా, రజితోత్సవ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. బీఆర్ఎస్ రజితోత్సవ సభ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. కేసీఆర్ వస్తానని చెప్పగానే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో జలదరించిందన్నారు.

అందుకే ఈ చెడ్డ ప్రభుత్వం ప్రతి అడుగుకూ పోలీసు ఆంక్షలు, నియంత్రణలు పెట్టింది. కార్యకర్తలు సమావేశ స్థలానికి చేరుకోకుండా 10-15 కిలోమీటర్ల దూరం వరకూ ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేశారు.. కరీంనగర్, సిద్ధిపేట, హుస్నాబాద్, వరంగల్ సహా అన్ని దిశల నుంచి వచ్చే వాహనాలను అన్నిచోట్లా అడ్డుకున్నారు. ట్రాఫిక్ జామ్ పేరిట పోలీసులు వాహనాలను వెనక్కు పంపించారు అని తెలిపారు.

హుస్నాబాద్ దాటి కొత్తపల్లిలో సంయుక్త మెదక్, నిజామాబాద్ జిల్లాల నుండి వచ్చే సుమారు 1000 వాహనాలను మళ్లించారు..ఆర్టీఓ అధికారులు అడుగు అడుగున తనిఖీలు చేశారు. స్కూలు బస్సులను అద్దెకు తీసుకున్న వారిపై నోటీసులు ఇచ్చి భయబ్రాంతులకు లోనయ్యారు అన్నారు. బీఆర్ఎస్ సభను ఏ రకమైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుపిత చర్యలు తీసుకుంది, సహకారం నిరాకరించి సభను విఫలపర్చాలని కుట్ర పన్నింది… సభకు వచ్చే అన్ని రహదారులను అడ్డగించి కాంగ్రెస్ మరోసారి తమ సంకుచిత ధోరణిని బయటపెట్టింది అన్నారు.

అయినా, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేధించుకుని సభకు వచ్చారని, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రజలను నమ్మించి మోసగించే మీ వంచనాత్మక ధోరణికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నారు. మరోసారి, రాజోత్సవ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు టీవీలపై లక్షల సంఖ్యలో వీక్షించిన తెలంగాణ పిల్లలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు హరీశ్‌ రావు.

Also Read:కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజలే కూలుస్తరు:కేసీఆర్

- Advertisement -