- Advertisement -
కూకట్ పల్లి కే.పి.హెచ్.బి లో బిఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించారు హైడ్రా అధికారులు. 27 వ తారీకున బిఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైడ్రా అధికారుల ముందు ధర్నాకి దిగారు బిఆర్ఎస్ కార్యకర్తలు.
రాత్రికి రాత్రే బిఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేయడం దుర్మార్గం అన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫ్లెక్సీలు నెలల తరబడి ఉన్నా.. అధికారులకు కనిపించవా..? చెప్పాలన్నారు.
రజతోత్సవాలు సభ జరగక ముందే ఫ్లెక్సీలు తీసేసారా.. ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీకి కోసం పనిచేస్తున్నారు అన్నారు. ప్రజల కోసం అధికారులు పనిచేయాలి పార్టీల కోసం కాదు..మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వడ్డీతో ఖచ్చితంగా అప్పచెపుతాం చెప్పాలన్నారు.
Also Read:పాకిస్తానీయులకు పోలీసుల నోటీసులు
- Advertisement -

