మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టారు ఎమ్మెల్యే దానం నాగేందర్. కేసీఆర్ సభ బాగా సక్సెస్ అయితుందని అనుకుంటున్నా అని మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ని చూడ్డానికి జనం ఆశగా ఉన్నారు.. ఎప్పటినుండో బాగా ఎదురు చూస్తున్నారు.. సభకు కూడా జనం బాగా వస్తారని నేను కూడా అనుకుంటున్నా అని చెప్పారు.
అలాగే స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వాస్తవాన్నే రీట్వీట్ చేశారు … కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు నేను భావించడం లేదు అని తెలిపారు.
గతంలోనూ దానం చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టాయి. ముఖ్యంగా హైడ్రా తీరును బాహాటంగానే ఎండగట్టారు దానం. తాజాగా బీఆర్ఎస్ సభపై మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
Also Read:షాకింగ్ వీడియో.. ఎంత దగ్గరి నుండి కాల్చారో చూడండి!

