సచిన్ బర్త్ డే..యువీ ఎమోషనల్ నోట్

14
- Advertisement -

భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సచిన్‌ను అమితంగా ఆరాధించే యువరాజ్ సింగ్ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశాడు. 1989 నవంబర్ 16న అంటే సచిన్ 16వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

అతను నా చిన్ననాటి హీరో. ఒకరోజు నేను డ్రెస్సింగ్ రూమ్‌లోకి నడిచిపోయినప్పుడు ఆయన అక్కడ ఉన్నారు..మాస్టర్‌ని చూసిన ఆ క్షణం అస్సలు మర్చిపోలేదన్నారు. ఎంత పెద్ద క్రికెటర్ అయినా కాసింత గర్వం కూడా లేని వ్యక్తి సచిన్ అన్నారు. అంతేగాదు ఈ పోస్ట్‌లో యువరాజ్-సచిన్ కలిసి గడిపిన గుర్తుండిపోయే క్షణాల వీడియోను కూడా షేర్ చేశారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 664 మ్యాచ్‌లలో 34,357 పరుగులు చేశాడు సచిన్. సగటు 48.52 కాగా 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు చేశారు. వన్డేల్లో 18,426 పరుగులు (సగటు: 44.83) ఉండగా 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో 15,921 పరుగులు (సగటు: 53.78) ఉండగా 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచినే.

 

Also Read:Guardian:ఓటీటీలోకి గార్డియన్!

- Advertisement -