తెలంగాణలో తేలికపాటి వర్షాలు

17
- Advertisement -

తెలంగాణలో ఇవాళ,రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేల అవకాశం ఉందని.. ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 4 ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43-44 డిగ్రీల వరకు చేరవచ్చు అని తెలిపింది వాతావరణ శాఖ. తూర్పు తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా ఉండే అవకాశం ఉందని.. ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణలో చిదుర వర్షాలు/గర్జనావృష్టి కనిపించొచ్చు అని తెలిపింది వాతావరణ శాఖ.

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ మరియు మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీల వరకు పెరగొచ్చు అని.. కడప, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ఎన్టీఆర్, పార్వతీపురం జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు/గర్జనావృష్టి సంభవించొచ్చు అని… విశాఖపట్నం గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

Also Read:ఐపీఎల్ 2025..ఫిక్సింగ్ ఆరోపణలు

- Advertisement -