ప్రజలు ఏ బాధ్యతల అప్పగించినా.. ఆ పాత్రలో ఇమిడిపోయి ప్రజా గొంతుకగా టిఆర్ఎస్ పని చేసింది. ఇవాళ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండానే అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన కేటీఆర్.. మగ్గలోపుట్టి పుబ్బలో పోతుందని మమ్మల్ని అవమానించినవారు. ఇవాళ కనుమరుగయ్యారు అన్నారు. కేంద్రంలో ఒకరు సహాయంమంత్రిగా , ఇంకొకరు నిస్సహాయ మంత్రిగా బిజెపి ఎంపిలు ఉన్నారు. వాళ్లతో తెలంగాణకు నయా పైస లాభం లేదు అన్నారు.
8 మంది బీజేపీలు తెల్లారి లేస్తే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డిని వదిలేసి కేసిఆర్ గారిని విమర్శిస్తారు. రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనరు.రక్షణ కవచం లాగా కాపాడుకుంటున్నారు…. హెచ్ సి యు భూముల తనఖా విషయంలో బడా ఆర్థిక మోసం జరిగిందని దాని వెనకాల ఒక బిజెపి ఎంపీ ఉన్నారని నేను విమర్శిస్తే బిజెపి నేతలు తట్టుకోవడం లేదు అన్నారు.
ఈ 16 నెలల కాలంలో తెలంగాణకు బిజెపి ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి అదనంగా తీసుకురాలేదు… హైదరాబాదులో హైడ్రా బాధితుల కోసం కొట్లాడ లేదు. మూసి నిర్వాసితుల దగ్గరికి పోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి బిజెపి నేతలు పోలేదు. ఏ ఒక్క ప్రజా పోరాటంలోని బిజెపి నేతలు లేరు అన్నారు.లగచర్లలో లంబాడ రైతులను జైల్లో పెడితే కూడా బిజెపి నేతలు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి హామీలను అమలు చేయకపోతే కూడా బిజెపి నేతలు అడగడం లేదు. బిజెపి నేతలను ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి? చెప్పాలన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ రాహుల్ గాంధీ ల మీద ఈడీ చార్జిషీట్ నమోదు చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు… చోటే భాయ్ రేవంత్ రెడ్డికి బడే భాయ్ మోడీకి మధ్య ఉన్న దృఢమైన బంధమే ఇందుకు కారణం అన్నారు. హెచ్.సి.యు భూముల తనఖా విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక మీద స్పందించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విచారణ జరపడానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు రావడం లేదు అన్నారు.
Also Read:దండులా పార్టీ ఆవిర్భావ సభకు కదలండి: కేటీఆర్
అమృత్ స్కాంలో గోల్మాల్ చేసిన రేవంత్ రెడ్డి బామ్మర్ది మీద, రెవిన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పై దాడి చేసిన ఈ. డి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు… రెండు ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలకు తెలంగాణ ప్రయోజనాలు ఏమాత్రం పట్టవు అన్నారు. తెలంగాణ బాగుండడం ఆ రెండు పార్టీలకు ఇష్టం లేదు..రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను బిఆర్ఎస్ తరఫున బాయికాట్ చేద్దాం అన్నారు. పార్టీ తరఫున కౌన్సిలర్లకు విప్ జారీచేస్తాం… విప్ ను ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటాం అన్నారు.
త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయి. వాటి కోసం కూడా కొట్లాడాలి…. ఏప్రిల్ 27 సభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తాం. ఈసారి డిజిటల్ మెంబర్షిప్ చేద్దాం అన్నారు. అక్టోబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తాము… నియోజకవర్గంలోని కార్యకర్తల కోసం శిక్షణ తరగతులను నిర్వహిస్తాము అని చెప్పారు.

