IPL 2025: హైదరాబాద్‌పై ముంబై గెలుపు

23
- Advertisement -

ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 167 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై.. 18.1 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను చేధించింది. రికల్టన్ 31,రోహిత్ శర్మ 26,విల్ జాక్స్ 36,సూర్య కుమార్‌యాదవ్ 26, తిలక్ వర్మ 21, పాండ్యా 21 పరుగులు చేశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 40, ట్రావిస్ హెడ్ 28, క్లాసెన్ 37,అనికేత్ వర్మ 18 పరుగులు చేశారు.

Also Read:ఓటీటీలోకి శివంగి..

మా బౌల‌ర్లు బౌలింగ్ చేసిన విధానం బాగుంది. ఎంతో తెలివిగా బౌలింగ్ చేశారు అన్నారు పాండ్యా. పిచ్ కండిష‌న్స్‌కు త‌గిన‌ట్లుగా బంతులు వేశారు…బేసిక్స్ కు క‌ట్టుబ‌డి బౌలింగ్ చేశారని అన్నాడు. దీప‌క్ చాహ‌ర్ వేసి తొలి ఓవ‌ర్‌లోనే బంతి ఆగుతూ వెళ్ల‌డం గ‌మ‌నించిన‌ట్లు తెలిపాడు. వెంట‌నే స్లో బాల్స్ వేయాల‌ని అనుకున్నామని, దానికి త‌గిన‌ట్లుగానే బౌలింగ్‌లో వేరియ‌ష‌న్స్ ప్రారంభించామ‌ని చెప్పాడు.

- Advertisement -