సన్న వడ్లు ఎవరూ బయట అమ్మొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒకటో తేదీ పోతారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఎక్కడైనా అవసరముంటే అదనంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్షా 116 చొప్పున 60మందికి చెక్కులు అందజేశారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కి గ్యాస్ అందిస్తున్నామన్నారు.
సన్న బియ్యం పంపిణీ అద్భుతమైన పథకమని అన్నారు. తమ పైసలతో అంటున్న కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకువచ్చామని…రెవెన్యూ పరమైన భూపంచాయితీ ఉండదని, భూమి అంటే ఆత్మగౌరవం అలాంటి పంచాయితీలు ఇక ఉండవని చెప్పారు.
Also Read:పర్యావరణ హననం..తప్పించుకోలేరు: కేటీఆర్

