పర్యావరణ హననం..తప్పించుకోలేరు: కేటీఆర్

17
- Advertisement -

పర్యావరణాన్ని విధ్వంసం చేసిన ఎవరూ తప్పించుకోలేరన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన కేటీఆర్… సుప్రీం కోర్టు ఆదేశాలను హర్షాతిరేకాలతో స్వాగతిస్తోంది. కనీసం ఇప్పుడు అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ హననానికి పాల్పడి తప్పించుకోవడం సాధ్యం కాదనే సంగతిని గుర్తించాలి అన్నారు.

కంచా గచ్చిబౌలిలో వృక్షాలు, వన్యప్రాణుల కోసం నిలబడి పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకుల నిరంతర కృషికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. నగరంలో 400 ఎకరాల అడవిని రక్షించడంలో ఎంతో సహకారం అందించారు అన్నారు.

 

Also Read:సుప్రీంలో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ

- Advertisement -