తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల సర్వే జరిపిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శంషాబాద్ నోవాటెల్లో మీడియాతో మాట్లాడిన పొన్నం… ఇందుకోసం సబ్ కమిటీ ,డెడికేటెడ్ కమిటీ వేసుకొని కాబినెట్ తీర్మానం చేసుకొని స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు వేరు వేరు బిల్లులు చట్టం చేయడం జరిగింది అన్నారు.
తెలంగాణ బీసీ ల పక్షాన ధన్యవాదాలు… వారం రోజుల్లో బీసీ మేధావులు ,కుల సంఘాలతో సమావేశం ఏర్పాటీ చేసుకొని భవిషత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నారు. శాసన సభలో బీజేపీ ,brs ఏకగ్రీవం బీసీ రిజర్వేషన్లు పెంచే తీర్మానానికి మద్దతు ఇవ్వడం జరిగింది… ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వాలి అన్నారు. దేశ వ్యాప్తంగా కుల సర్వే రోల్ మోడల్
ఇది అమలు చేయడానికి ప్రక్రియ వేగవంతం చేస్తాం.. శాసన సభలో మద్దతు ఇచ్చినట్టు ఇప్పుడు కూడా బీజేపీ,బీఆర్ఎస్లు మద్దతు ఇవ్వాలి అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు మాకు సానుకూలంగా ఉంది.. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది… పారదర్శకంగా చేసిన సర్వే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు అన్నారు. ఎస్సీ వర్గీకరణ దేశంలోనే చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ.. ఇది విప్లవాత్మక నిర్ణయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఈ సమయాన్ని క్షేత్ర స్థాయిలో ముందుకు తీసుకుపోతాం అన్నారు. సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న వడ్లు కి బోనస్ ఇస్తున్నాం.. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాం, చరిత్రలో ఇన్ని కార్యక్రమాలు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు అన్నారు.

