మూత పడిన పరిశ్రమల్ని తెరిపిస్తాం..

190
KTR
- Advertisement -

తెలంగాణలోని మూత పడిన పరిశ్రమలను తిగిరి పున:ప్రారంభించేందుకు తాము చిత్త శుద్దితో ప్రయత్నం చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ర్టంలోని మూతపడిన పరిశ్రమల పునరుద్దరణ కోసం ప్రత్యేక వ్యహంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలోని భీమా సిమెంట్ ప్యాక్టరీ పున: ప్రారంభానికి ప్రభుత్వం ప్రకటించిన ప్రొత్సాహకాలను, పలు అంశాల్లోని సడలింపులను మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాలే పరిశ్రమల మూతకు కారణమన్న మంత్రి, మూతపడిన పరిశ్రమలకు జవసత్వాలిచ్చేందుకు ప్రభుత్వపమైన, విధాన పరమైన సడలింపులు, సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఇప్పటికే రామగుండ ఎరువుల కర్మాగారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్దతో, కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు ఫలితానిచ్చాయని మంత్రి గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్రం సహకారంతో రామగుండం ప్యాక్టరీ ప్రారంభం అయిందని తెలిపారు. నూతన పరిశ్రమల కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులకు ప్రయత్నాలు చేస్తూనే పున: ప్రారంభించేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్యాక్టరీని తెరిపిస్తాం అన్నారు. ఈ మేరకు ప్రస్తుతం సిర్పూర్ పేపర్ మిల్స్ పురుద్దరణ కోసం పలు కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పలు కంపెనీలతో అడ్వాన్స్ లెవల్ చర్చలు సానూకూలంగా సాగుతున్నాయని తెలిపారు. కొత్త పెట్టుబడుల కోసం టియస్ ఐపాస్ వంటి అద్బుతమైన పాలసీని అమలు చేస్తున్న తమ ప్రభుత్వం, ఇండస్ర్టీయల్ హెల్త్ క్లినిక్ ల పేరిట మరో వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా త్వరలోనే పలు మరిన్ని చిన్న, మద్యతరహ పరిశ్రమలు పునరుద్దరించేందుకు అవకాశం ఉన్నదన్న అశా భావం వ్యక్తం చేశారు.

భీమా సిమెంట్స్ ప్రొమోటర్లతో పలు సార్లు చర్చలు జరిపిన మంత్రి, కంపెనీ పునరుద్దరణకు అవసరమైన అంశాలను చర్చించారు. నల్లగొండ జిల్లాలోని మేళ్ళచేరువు మండలంలో 1986 ప్రారంభం అయిన భీమా సిమెంట్స్ గత ప్రభుత్వ హాయంలో విద్యుత్ కొరత వలన నష్టాలకు గురైంది. 2010 నాటికే కంపెనీ తొమ్మది లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న కంపెనీ,తమ పునరుద్దరణ ప్రయత్నాలను చేసే క్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావును కలవడం జరిగింది. ఈమేరకు భీమా సిమెంట్స్ కు వచ్చిన సుమారు 34 కోట్ల నష్టాలతో 2014లో విద్యుత్ సరఫరాను నిలిపేయడం జరిగింది.

మంత్రి కెటి రామారావు అదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2016లో అధికారులతో కమీటీ వేసి ప్యాక్టరీకి అందివ్వాల్సిన సహకారం పైన చర్చించారు. ఈ మేరకు కంపెనీ పునరుద్దరణకు వాణిజ్య శాఖకు చెల్లించాల్సిన బాకాయిలను 36 వాయిదాల్లో కట్టేందుకు అనుమతించారు. దీంతోపాటు విద్యుత్ శాఖ, గనుల శాఖ బకాయిలను సైతం వాయిదాల్లో చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. కంపెనీ ఉత్పత్తి ప్రారంభిస్తూ సుమారు 1000 మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి కెటి రామారావు తెలిపారు. ఖాయిల పరిశ్రమ పునరుద్దరణకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్న ముఖ్యమంత్రి అదేశాల మేరకు భీమా సిమెంట్స్ పునరుద్దరణకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -