- Advertisement -
ఈ నెల 16న ఎమ్మెల్సీగా దాసోజు శ్రావణ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 16వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో శాసన మండలి సభ్యునిగా (MLC) ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అని తెలిపారు శ్రావణ్.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు తొలుత అమరవీరుల స్మారక స్థూపానికి పూలమాలలు వేసి నివాళి అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ , హరీష్ రావు , మధుసూదనాచారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు పార్టీ ప్రముఖ నేతలు హాజరుకానున్నారని చెప్పారు.
Also Read:అంబేద్కర్‌కు ప్రముఖుల నివాళులు
- Advertisement -

