తిరుమలలో వ్యవస్థలు దెబ్బతిన్నాయి:టీటీడీ ఈవో

10
- Advertisement -

టీటీడీలో ఇటీవలి పరిణామాలపై ఈవో శ్యామలరావు వివరణ ఇచ్చారు. తిరుమలలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని గతంలో సీఎం చంద్రబాబు తమ దృష్టికి తెచ్చారని ఈవో శ్యామలరావు తెలిపారు.

ఈ వ్యవస్థలపై ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారని వెల్లడించారన్నారు. భక్తుల సూచనల మేరకు టీటీడీలోని అన్ని వ్యవస్థలను క్రమబద్దీకరించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ఇక తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజినోవ విరాళం ప్రకటించారు. తన కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద రూ.17 లక్షల విరాళం ఇచ్చారు అన్నా లేజినోవ. మార్క శంకర్ పేరు మీద ఈరోజు భక్తులకు మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించనున్నారు.

Also Read:ఇంటర్‌ తర్వాతే టెన్త్ రిజల్ట్స్!

- Advertisement -