నారా రోహిత్ , సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, డా. రాజేంద్ర ప్రసాద్, కాంబినేషన్ లో రూపొందుతున్న ‘శమంతక మణి’ చిత్రం జులై 14 న విడుదలకు సిద్ధమవుతోంది. ‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో భవ్య క్రియేషన్స్ పతాకం పై v. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత v .ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ – “హీరోలుగా చాలా బిజీ గా ఉన్న నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది ఈ మల్టీ స్టారర్ చేయడానికి ఒప్పుకున్నారంటేనే , ఈ కథలో ఉన్న దమ్ము ఏంటో అర్థమవుతోంది. ఎవరూ ఊహించని మలుపులతో , పుష్కలమైన థ్రిల్లింగ్ అంశాలతో ఉన్న ఈ సినిమా కచ్చితంగా క్లాస్ నీ , మాస్ నీ, ఆకట్టుకుంటుంది. పురాణాల్లో పాపులరైన ‘శమంతకమణి’ గురించిన కథ కాదు ఇది. అసలు ఈ ‘శమంతకమణి’ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.” అని తెలిపారు.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ – ‘ఇందులో నారా రోహిత్ పాత్ర పేరు ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ . ఇంతకుముందు ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ పేరుతో పోలీస్ పాత్రలు చేసి సెన్సేషన్ సృష్టించారు. నారా రోహిత్ పాత్ర , ఆటిట్యూడ్ చాలా ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక సుధీర్ బాబు చేసిన కృష్ణ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది.కార్తీక్ పాత్రలో నటించిన ఆది మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. కోటిపల్లి శివగా సందీప్ కిషన్ మంచి మాస్ పాత్ర పోషించారు. ఈ నలుగురి పాత్రల మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది. కానీ వీరు నలుగురూ కలుసుకునే సందర్భం , వీళ్ళ మధ్య నడిచే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగానూ ఉంటాయి. ” అని చెప్పారు.
చాందినీ చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ళ భరణి, హేమ, సురేఖ వాణి, సత్యం రాజేష్, బెనర్జీ, అదుర్స్ రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం :మణిశర్మ,కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్స్: వివేక్ అన్నామలై, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.