హైదరాబాద్‌లో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ రీజన్‌తో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతిచెందాయి. ల్యాబ్ నుంచి వచ్చిన టెస్టు ఫలితాల్లో బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ ఫామ్స్ ను అధికారులు సీజ్ చేశారు.
బర్డ్ ఫ్లూగా నిర్దారణ అయిన అబ్దుల్లా పూర్ మెంట్ ఫౌల్ట్రీ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, దోతిగూడెంలోని మూడు ఫౌల్ట్రీ ఫామ్స్ లో బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఐదు కిలో మీటర్లు వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు.
కోళ్లు ఇతర ఫౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఈ వ్యాధి వస్తే జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితోపాటు కడుపు నొప్పి, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు వ్యక్తిగత శుభ్రత కచ్చితంగా పాటించాలి. నగర శివార్లలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో నగరంలోని చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
Also Read:పవన్‌తో ఎమ్మెల్సీ నాగబాబు భేటీ..

