IPL 2025:ఆర్సీబీ ఓటమి

16
- Advertisement -

ఐపీఎల్ 2025లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ విధించిన 170 పరుగుల టార్గెట్‌ను గుజరాత్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది.

బట్లర్ 39 బంతుల్లోనే 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా ఓపెనర్ సాయి సుదర్శన్ 36 బంతుల్లో 49 పరుగులు చేశాడు. రూథర్ ఫోర్డ్ 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో గుజరాత్ గెలపు సునాయసమైంది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ..నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 169 పరుగులు చేసింది.లివింగ్ స్టోన్ 54,జితేశ్ శర్మ 33,టిమ్ డేవిడ్ 32 పరుగులు చేశారు. ఆర్సీబీకి ఇది తొలి ఓటమి.

Also Read:బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై కేసీఆర్ సమావేశం

- Advertisement -